మహేశ్ బాబు ముద్దుల తనయుడు గౌతమ్‌కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ సతీమణి నమ్రతా తన కుమారుడు గౌతమ్‌కు సామాజిక మాధ్యమం వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. "13వ ఏట అడుగుపెట్టిన మిస్టర్ గౌతమ్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసింది నమ్రతా.
" గడియారం ముల్లు 12 దాటగానే.. నా కుమారుడు 13వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అతడు టీనేజర్. ఈ సందర్భంగా మహేశ్.. గౌతమ్‌కు ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఇచ్చి ముద్దుపెట్టుకున్నాడు. నా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఐ లవ్యూ మిస్టర్ గౌతమ్ ఘట్టమనేని" - నమ్రతా శిరోద్కర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందణ్న కథానాయిక. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.
ఇదీ చదవండి: ఆస్కార్ నటుడు అధ్యాపకుడయ్యాడు..!