"నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్.." అంటూ ఖాకీ చొక్కా తొడిగి మళ్లీ పూర్ణా మార్కెట్‌లోకి అడుగు పెట్టేశారు కింగ్ నాగార్జున. వచ్చీ రాగానే మాస్కులు లేకుండా మార్కెట్లో తిరుగుతున్న బ్రహ్మాజీ గ్యాంగ్‌కు, అక్కడి జనాలకు వార్నింగ్ ఇచ్చారు.
"ఇప్పటివరకు మాస్కుల్లేకుండా ఎందుకు తిరిగారో నేనడగా. కానీ, ఇప్పటి నుంచి తప్పదు. సడన్‌గా కరోనా ఉంది. మాస్కులేసుకోండి అంటే కాస్త కష్టంగానే ఉంటది. ఇంట్లోనూ ఒకరికొకరు దూరంగా ఉండటానికి ట్రై చేయండి. కానీ, మీరు అలా తిరగకుండా ఉండలేరని తెలుసు. కానీ, తప్పదు. నా మాట వినకుండా బయటకొస్తే పుచ్చలెగిరిపోతాయ్" అంటూ దుమ్ములేచి పోయేలా క్లాస్ పీకడమే కాదు.. ఆ మాటకు ఎదురు చెప్పిన ఓ రౌడీకీ తనదైన రీతిలో డోస్ ఇచ్చారు.
ఏంటి ఈ సన్నివేశం అనుకుంటున్నారా? మరేం లేదండీ.. కొంతమంది సృజనాత్మక వ్యక్తులు ప్రముఖ కథానాయకులు నటించిన సినిమాల్లోని సన్నివేశాలను కరోనాపై స్ఫూర్తిని రగిలించేలా సరికొత్తగా ముస్తాబు చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాగే నాగ్ - పూరిల హిట్ చిత్రం 'శివమణి'లోని పూర్ణా మార్కెట్లోని ఓ చక్కటి సీన్‌ను దానిలోని నాగ్ డైలాగ్‌ను.. ప్రస్తుత కరోనా పరిస్థితులపై వ్యంగ్యాస్త్రంలా మార్చి కొందరు అభిమానులు నెట్టింట పంచుకున్నారు. ఇప్పుడీ సన్నివేశాన్ని చూసిన నాగ్ వాళ్ల ప్రతిభకు ముచ్చటపడుతూ ఆ క్లిప్పింగ్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
"ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో పూరితో కలిసి మళ్లీ 'శివమణి' తీస్తే అందులో డైలాగ్‌లు కచ్చితంగా ఇలాగే ఉంటాయి" అంటూ దానికి ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు నాగ్. నిజంగా ఈ వీడియోలో నాగ్ వాయిస్‌ను చక్కగా మిమిక్రీ చేస్తూ.. మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి రవి చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
-
If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020