ETV Bharat / sitara

'బిగ్​బాస్ 4' సెట్​లో అడుగుపెట్టిన నాగార్జున - Bigg Boss telugu 4 latest news

'బిగ్​బాస్ 4' సీజన్​కు సంబంధించిన తొలి అడుగుపడింది. ప్రోమో షూటింగ్​ను అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్​లో జరిపారు. త్వరలో దీనిని విడుదల చేయనున్నారు.

'బిగ్​బాస్ 4' షూటింగ్ షురూ.. త్వరలో టీజర్
'బిగ్​బాస్ 4'
author img

By

Published : Jul 31, 2020, 10:21 PM IST

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌ 4'. లాక్‌డౌన్‌తో ఇంతకాలం ఈ షో పట్ల సందిగ్ధత నెలకొనగా, నిర్వాహకులు టీజర్‌తో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించిన టీజర్‌ షూటింగ్‌ ప్రారంభించారు.

మూడో సీజన్​ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో నాగార్జున.. ఈ సీజన్​కూ హోస్ట్​గా కనిపించనున్నారు. ఇందులో భాగంగా జరిగిన యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ చిత్రీకరణ జరిగింది. 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేయనున్నారు.

మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.