ETV Bharat / sitara

పూజాహెగ్డే కొత్త సినిమా.. మరోసారి చైతూతో కలిసి! - నాగచైతన్య వెంకట్​ ప్రభు సినిమా

Nagachaitanya pooja hegdey: దర్శకుడు వెంకట్​ ప్రభు-నాగచైతన్య కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్​గా పూజాహెగ్డేను ఎంపిక చేసే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

nagachaitanya pooja hegdey
నాగచైతన్య పూజాహెగ్డే
author img

By

Published : Feb 17, 2022, 10:42 AM IST

Nagachaitanya pooja hegdey: యువ హీరో అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమాను తమిళ దర్శకుడు వెంకట్​ ప్రభుతో చేయనున్నారని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పుడీ చిత్రం గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్​గా పూజాహెగ్డేను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కథానాయిక పాత్రకు ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని మూవీటీమ్​ ఆలోచిస్తుందట! ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

గతంలో పూజాహెగ్డే, నాగచైతన్య కలిసి 'ఒక లైలా కోసం' చిత్రంలో నటించారు. ఈ మూవీ సూపర్​హిట్​గా నిలిచింది. కాగా, చైతూ ఇటీవలే 'లవ్​స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్​ అందుకున్నారు. త్వరలోనే 'థ్యాంక్యూ', 'లాల్​ సింగ్​ చద్ధా'తో అభిమానులను పలకరించనున్నారు. ఇక పూజాహేగ్డే పలు స్టార్​ హీరోల చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో 'బీస్ట్'​, 'సర్కస్'​ ఉన్నాయి. త్వరలోనే ఆమె నటించిన 'ఆచార్య', 'రాధేశ్యామ్'​ మూవీస్​ విడుదల కానున్నాయి.

ఇదీ చూడండి: నా తల్లి వేశ్య కాదు.. ఆలియా సినిమాపై గంగూబాయ్​ తనయుడు ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.