ETV Bharat / sitara

ఆ సినిమాతో​ నాగబాబు బాలీవుడ్​ ఎంట్రీ! - ఛత్రపతి హిందీ రీమేక్​లో నాగబాబు

మెగా బ్రదర్​ నాగబాబు బాలీవుడ్​లో అడుగుపెట్టనున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. 'ఛత్రపతి' హిందీ రీమేక్​లో ఈయన ప్రతినాయకుడిగా ఎంపికయ్యారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

Nagababu will going to play the villain role in chatrapathi remake
ఆ సినిమాతో​ నాగబాబు బాలీవుడ్​ ఎంట్రీ!
author img

By

Published : Mar 24, 2021, 8:01 AM IST

నటుడు నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్​గా నిలిచిన 'ఛత్రపతి' రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ రూపొందించనున్నారు.

Nagababu will going to play the villain role in chatrapathi remake
నాగబాబు

సినీవర్గాల సమాచారం మేరకు.. నాగబాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే నాగబాబుతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు కూడా తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చూడండి: 'ఎప్పుడూ పాజిటివ్​గా ఉండేందుకే ప్రయత్నిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.