బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'లాల్‌సింగ్ చద్దా' షూటింగ్ తుదిదశకు చేరుకుంది. లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. యువ హీరో నాగ చైతన్య కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్రబృందం అక్కడే ఉంది. తాజాగా షూటింగ్ బ్రేక్‌లో సినిమా యూనిట్ టేబుల్ టెన్నిస్‌తో కాలక్షేపం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ చిత్రాల్లో ఆమిర్, చైతూ, కిరణ్ రావు సహా పలువురు టీటీ ఆడుతూ కనిపించారు.
నాగశౌర్య హీరోగా నటిస్తోన్న లక్ష్య' ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటోంది. విలువిద్య(ఆర్చరీ) కథతో తెలుగులో తీస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. కేతికా శర్మ హీరోయిన్. ఇందులో శౌర్య సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది చిత్రబృందం. ప్రతి శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తామని తెలిపింది.
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. 'మంచిరోజులు వచ్చాయి' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు (శనివారం) సాయంత్రం 6 గంటలకు ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు.