యువసామ్రాట్ నాగచైతన్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందం అంతా హాజరైంది. హీరోయిన్గా 'ఫిదా' ఫేమ్ సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు అక్కినేని హీరో.
క్లాస్ చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నారాయణదాస్ నారంగ్, రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే సామ్‌కు ఇష్టం'


