దేశంలో కరోనా విలయతాండవం చేస్తోన్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌లు విధించారు. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరైతే లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదంటూ పోస్టులు చేస్తున్నారు.
కాగా, దర్శకుడు నాగ్ అశ్విన్ గురువారం ఓ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని ఆయన పిలుపునిచ్చారు. "లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్ వేయించుకుందాం. వైద్యులకు కొంత ఉపశమనం అందిద్దాం" అని నాగ్ ట్వీట్ చేశారు.
-
Whether the government declares it or not...next 2 weeks should be a personal lockdown...For those of you who say lockdown is not the answer, pls go see the hospitals and how overworked they have been the past month..While we mass vaccinate, we must give the doctors some relief
— Nag Ashwin (@nagashwin7) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Whether the government declares it or not...next 2 weeks should be a personal lockdown...For those of you who say lockdown is not the answer, pls go see the hospitals and how overworked they have been the past month..While we mass vaccinate, we must give the doctors some relief
— Nag Ashwin (@nagashwin7) April 29, 2021Whether the government declares it or not...next 2 weeks should be a personal lockdown...For those of you who say lockdown is not the answer, pls go see the hospitals and how overworked they have been the past month..While we mass vaccinate, we must give the doctors some relief
— Nag Ashwin (@nagashwin7) April 29, 2021