అక్కినేని కుటుంబం నుంచి మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందా? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ చిత్రంలో అక్కినేని సోదరులు మాత్రమే కథానాయకులుగా కనిపిస్తారట. అదేనండి.. నాగచైతన్య - అఖిల్ ప్రధాన పాత్రధారులుగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాకు యువ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నాడట. 'చిలసౌ' చిత్రంతో అక్కినేని కాంపౌండ్‌ను ఆకర్షించిన ఈ యువ డైరెక్టర్.. తాజాగా నాగార్జునతో ‘'మన్మథుడు 2'ను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలోనే నాగ్‌కు రాహుల్ పని నచ్చినందున ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను అతని చేతుల్లో పెట్టడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడట. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
నాగార్జున మాత్రం 'మన్మథుడు 2' హడావుడి ముగియగానే కల్యాణ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు'కు సిద్ధమవనున్నాడు. ఇందులో నాగ్‌తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించనున్నాడు.
ఇవీ చూడండి.. 'భావోద్వేగానికి గురై ఏడ్చిన సందర్భాలెన్నో'