అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకుడు. ఇటీవల సినిమా ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో ఎప్పుడూ చూడని విధంగా జైల్లో నగ్నంగా కూర్చొని, ఆందోళనగా కనిపిస్తున్నారు నరేశ్. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులను పరిచయం చేశారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీస్ పాత్రలో హరీశ్ ఉత్తమన్, సంతోష్‌గా నటుడు ప్రవీణ్ కనిపించనున్నారు.

ఈ చిత్రం లాక్‌డౌన్ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లరి నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 30న సినిమాలోని చిన్న గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


