ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం అనారోగ్య కారణాలతో సోమవారం(డిసెంబరు 28) తుదిశ్వాస విడిచారు. ఈమె మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు.
తన మ్యూజిక్ కెరీర్లో తల్లి కరీమా పాత్ర చాలా కీలకమైనదని గతంలో రెహమాన్ చెప్పారు. ఆమె మృతిపై టాలీవుడ్ సంగీత దర్శకులు తమన్, దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![Music Director AR Rahman's mother Kareema Begum passed away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10033386_ar-rahman-kareema-1.jpg)