అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వస్తున్న రోజులవి (2011). 'గంగ్నమ్ స్టైల్' అంటూ వచ్చిన విదేశీ పాట యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఎక్కడ విన్నా, ఎవరు కన్నా.. దీని గురించే చర్చ. అయితే అది అంతర్జాతీయ గుర్తింపు పొందిన పాప్ సింగర్, డ్యాన్సర్ చేసిన వీడియో కావడం వల్ల అంతగా ప్రాచుర్యం పొందింది.
'కొలవెరి'తో మొదలై
అప్పటి వరకు భారత్ తరఫున ఇలాంటి వీడియో రాలేదనే చెప్పొచ్చు. తన సంగీత ప్రతిభతో 21 ఏళ్ల వయసులో తొలి సినిమాతోనే దానికి సమాధానమిచ్చాడు అనిరుధ్. 'కొలవెరి' అంటూ ప్రపంచమంతా ఈ పాట గురించి మాట్లాడుకునేలా చేశాడు. పాట విన్న వాళ్లు మళ్లీ మళ్లీ విన్నారు. అసలు ఈ పాటను వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తమిళ అగ్ర నటుడు ధనుష్, శ్రుతి హాసన్ నటించిన ప్రేమకథ '3' చిత్రం కోసం అనిరుధ్ స్వరపరిచిన పాటిది. అప్పట్లో ఇదొక సంచలనం. దీంతో కోలీవుడ్‌లోని అగ్ర కథానాయకులందరికీ సంగీతం అందించేందుకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు అనిరుధ్.
భాషతో సంబంధం లేకుండా
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు సంగీతం అందించి అలరించాడు. ఇలా మొదటి అవకాశంతోనే భాషతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన అనిరుధ్ పుట్టిన (16 అక్టోబరు 1990) రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సంగీత సారథ్యంలో వచ్చి శ్రోతలను మైమరపించిన కొన్ని పాటలు మీ కోసం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:నిరీక్షణకు 'తెర'.. ప్రదర్శనలు షురూ