*ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో ఎన్టీఆర్.. ఆదివారం జరిగే 'తెల్లవారితే గురువారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా రానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీసింహా, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లు. మార్చి 27న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
![thellarithe guruvaram pre release vent](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11087339_movie-4.jpg)
*కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన 'యువరత్న' ట్రైలర్ విడుదలైంది. మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకుడు. ఏప్రిల్ 1న థియేటర్లలో చిత్రం రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*ధనుష్ 'కర్ణన్' సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 23న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
![dhanush karnan teaser](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11087339_movie-3.jpg)
*'సీటీమార్'లోని స్పెషల్ సాంగ్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో అప్సర రాణి డ్యాన్స్ చేసింది. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లు. సంపత్ నంది దర్శకుడు.
![seetimaar pepsi aunty song](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11087339_movie-2.jpg)