*టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ.. హీరోగా మారారు. ఆయన నటిస్తున్న తొలి సినిమా 'జే1' సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్. మురళీ రాజ్ దర్శకుడు.
*బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం 'ద సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్' విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. క్యాన్సర్తో ఈ ఏడాది ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు.
*సోనమ్ కపూర్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్' సినిమా ప్రారంభమైంది. స్కాట్లాండ్లో సోమవారం నుంచి షూటింగ్ మొదలైనట్లు చిత్రబృందం వెల్లడించింది. బ్లైండ్ పోలీస్ అధికారి, సీరియల్ కిల్లర్ మధ్య జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు.
*రవితేజ, శ్రుతి హాసన్ నటిస్తున్న 'క్రాక్' సినిమా ట్రైలర్.. న్యూయర్ కానుకగా రానుంది. సంక్రాంతికి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
*రామ్ 'రెడ్' సినిమాలో 'డించక్ డించక్' పూర్తి వీడియో సాంగ్.. ఈనెల 30న విడుదల కానుంది. జనవరి 14న థియేటర్లలో చిత్రం రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.