ETV Bharat / sitara

కొడుకు కల 'టెర్మినేటర్‌'! అమ్మ కల 'అవతార్‌'! - కొడుకు కల 'టెర్మినేటర్‌'

'టెర్మినేటర్', 'అవతార్' సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. అయితే ఈ రెండు సినిమాలు పట్టాలెక్కేందుకు ఓ కల కీలకపాత్ర పోషించిందని మీకు తెలుసా?

Mothers dream Avatar! Sons Dream Terminator
కొడుకు కల 'టెర్మినేటర్‌'! అమ్మ కల 'అవతార్‌'!
author img

By

Published : Jan 2, 2021, 8:34 PM IST

ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించిన 'టెర్మినేటర్‌', 'అవతార్‌' సినిమాలకు ఓ తల్లీ కొడుకుల కలలు నాంది పలికాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ రెండు సినిమాల దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అనేది తెలిసిందే.

కామెరూన్‌ సినిమా ప్రయత్నాలు చేస్తూ ఆర్ట్‌ డైరెక్టర్‌గా, మినియేచర్‌ మోడల్‌ మేకర్‌గా ఏవేవో పనులు చేస్తున్న రోజులవి. 'పిరానా' సినిమాకి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా ఆ సినిమా దర్శకుడితో నిర్మాతకి ఏవో విభేదాలు తలెత్తాయి. దాంతో అతడిని తొలగించి కామెరాన్‌కి దర్శకుడి అవకాశం ఇచ్చాడు. అయితే తొలి రోజు తొలి షాట్‌నే కామెరూన్‌ తీయలేకపోవడం వల్ల అతడినీ తొలగించి లొకేషన్‌లో అసిస్టెంట్‌గా పనిచేయమన్నారు. ఆ రోజుల్లోనే ఓసారి కామెరాన్‌ అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యంతో పడుకుని ఉండగా ఓ రాత్రి అతడికి ఓ భయంకరమైన కల వచ్చింది. భవిష్యత్తులోంచి ఓ అదృశ్య రోబో తనను చంపడానికి వచ్చిందనేదే ఆ కల. ఆ కలనే ఆధారం చేసుకుని 'టెర్మినేటర్‌' కథ అల్లుకున్నాడు కామెరాన్‌. దాని విజయంతో కామెరూన్‌ తిరుగులేని దర్శకుడైపోయాడు.

ఇక 'అవతార్‌' విషయానికి వస్తే.. దానికి కథ అల్లుకుంటున్న సమయంలో ఓ వింత గ్రహాన్ని, అందులో ఉండే వింత గ్రహాంతర వాసుల్నీ ఊహించాడు. వాళ్ల రూపాలు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు అతడికి వాళ్లమ్మకి వచ్చిన కల గుర్తొచ్చిందిట. ఓసారి వాళ్లమ్మ తన కలలో 12 అడుగుల పొడవుగా, నీలం రంగులో ఉన్న ఓ అమ్మాయి కనిపించిందని చెప్పిందట. ఆ సంగతి గుర్తొచ్చిన కామెరూన్‌ 'అవతార్‌' సినిమాలో కనిపించే పండోరా గ్రహంలోని నీలం రంగు ఎలియన్స్‌ పాత్రలకు రూపకల్పన చేసుకున్నాడు. అంటే... ఈ తల్లీ కొడుకుల కలలు వెండితెరకు ఎక్కి కాసులు కురిపించాయన్నమాట!

ఇవీ చూడండి: ప్రభుదేవా 'ముక్కాబులా' పాట పుట్టిందిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.