'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. పూజా హెగ్డే నాయిక. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తోంది. ఈ వేసవికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగిసినా.. థియేటర్లు ఓపెన్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఓటీటీలో విడుదలకు కొందరు నిర్మాతలు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ సినిమా విడుదల గురించి టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఎంత ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తుందట చిత్రబృందం. దసరా కానుకగా ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ప్రేక్షకుల్ని పలకరిస్తాడని ప్రచారం ఊపందుకుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. గోపీ సుందర్ సంగీతం అందించారు.