ETV Bharat / sitara

మనసా.. మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే!

అఖిల్ అక్కినేని.. మగువల మనసు దోచే యువహీరో. ఓ వయసు వచ్చాక కుర్రాళ్ల మనసు వారి మాట వినదు. ఇక ఓ అందమైన అమ్మాయి ఎదురైతే అంతే. అలాంటి పరిస్థితి నుంచే తనను తాను అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​' అఖిల్​. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఏప్రిల్​ వరకు ఆగాల్సిందే.!

Most Eligible Bachelor is written and directed by Bhaskar and produced by Bunny Vas and Vasu Varma featuring Akhil Akkineni
తన వలలో పడబోకే మనసా!
author img

By

Published : Mar 3, 2020, 8:32 AM IST

కుర్రాళ్ల మనసు ఒక పట్టాన మాట వినదు. ఇక వలపు బాణం గుండెకి తగిలిందంటే అంతే. మనసు మనసులో ఉండదు. నచ్చిన ఆ అమ్మాయి చుట్టూనే గింగిరాలు కొడుతుంది. ఇక్కడ ఓ బ్యాచ్‌లర్‌ కుర్రాడి పరిస్థితి అలాగే ఉంది. కానీ తన మనసును అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు.

'పిలిచా అరిచా అయినా నువ్‌ వినకుండా తనవైపు వెళతావే మనసా'... అంటూ కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ కథ ఎక్కడిదాకా వెళ్లిందో తెలియాలంటే 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' విడుదల వరకు ఆగాల్సిందే.

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నాడు. ఈ చిత్రంలోని 'మనసా మనసా..' పాటను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. గోపీసుందర్‌ స్వరపరిచిన ఈ గీతానికి సురేందర్‌ కృష్ణ సాహిత్యం అందించాడు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్‌, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాను.. ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: '18 ఏళ్ల కుర్రాడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా నటించా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.