'పట్నం వచ్చిన పతివ్రతలు', 'బిల్లా రంగా', 'కొదమసింహం'.. ఇలా చిరంజీవి-మోహన్‌బాబు కలిసి చేసింది కొన్ని చిత్రాలే. వీరిద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకులకు పండుగే. కానీ సుమారు 30 ఏళ్ల నుంచి వీరిద్దరూ ఏ సినిమా కోసం జతగా పనిచేయలేదు. కాగా, ఇన్నేళ్ల తర్వాత చిరు-మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' కోసం కలిసి పనిచేశారు. అయితే ఇందులో చిరు నటించలేదు కానీ తన గాత్రాన్ని మాత్రం అందించారు.
మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ని నటుడు సూర్య విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ టీజర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు.
"మన అంచనాలకు అందని ఒకవ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటూ. తను ఎప్పుడు ఎక్కడుంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుకా..!! తన బ్రెయిన్‌లోని న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి థాట్స్‌ని ట్రిగ్గర్ చేస్తాయో ఏ బ్రెయిన్ స్పెషలిస్టు చెప్పలేడు" అంటూ సినిమాలో మోహన్‌బాబు పాత్ర ఎలా ఉంటుందో చిరు తన మాటలతో పరిచయం చేశారు. కాగా, మోహన్‌బాబు యాక్షన్, పవర్‌ఫుల్ లుక్స్‌తోపాటు 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. చిరు వాయిస్, మోహన్‌బాబు నటనతో వచ్చిన ఈ టీజర్ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">