పాత్ర ఎలాంటిదైనా(unstoppable with nbk aha) , జానర్ ఏదైనా వెండితెరపై తన నటన, వాక్ చాతుర్యంతో కట్టిపడేసే కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పటివరకూ హీరోగా అలరించిన ఆయన వ్యాఖ్యాతగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. 'అన్‌స్టాపబుల్' అనే కార్యక్రమంలో సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వినోదం పంచనున్నారు(balakrishna on aha). ఈ షోకు హాజరైన తొలి సెలబ్రిటీ మోహన్‌బాబు అని సమాచారం. ఇప్పటి వరకూ బయటపెట్టని ఎన్నో విషయాల్ని ఆయన బాలకృష్ణతో పంచుకున్నారని తెలుస్తోంది(balakrishna unstoppable). సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. మరోవైపు, మెగా కుటుంబం నుంచి నాగబాబు ఈ షోలో పాల్గొన్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
"ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్‌స్టాపబుల్'. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా" అని ఈ షో కర్టెన్ రైజర్ వేడుక సమయంలో నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా నవంబరు 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆహా' అనిపించేలా బాలయ్య 'సింహా' సీన్ రిపీట్!