ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజూకూ విజృంభిస్తోంది. ఆ మహమ్మారి కట్టడి కోసం ప్రపంచదేశాలు ఎంతో శ్రమిస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఇంట్లో ఉండకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ గురించి ఓ చిన్నారి ముద్దుముద్దుగా చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
-
A friend shared this video which is a MUST share one. This young chap has really taken the #Lockdown very seriously because #ModiUncle said so. You will love his cuteness as well as his commitment. Thank you my young friend!! You are the BESTEST!! 😍👏 #ModiUncle @narendramodi pic.twitter.com/svMjDHSMpk
— Anupam Kher (@AnupamPKher) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A friend shared this video which is a MUST share one. This young chap has really taken the #Lockdown very seriously because #ModiUncle said so. You will love his cuteness as well as his commitment. Thank you my young friend!! You are the BESTEST!! 😍👏 #ModiUncle @narendramodi pic.twitter.com/svMjDHSMpk
— Anupam Kher (@AnupamPKher) April 13, 2020A friend shared this video which is a MUST share one. This young chap has really taken the #Lockdown very seriously because #ModiUncle said so. You will love his cuteness as well as his commitment. Thank you my young friend!! You are the BESTEST!! 😍👏 #ModiUncle @narendramodi pic.twitter.com/svMjDHSMpk
— Anupam Kher (@AnupamPKher) April 13, 2020
వీడియోలో ఓ చిన్నారిని అతని తల్లి బయటకు వెళ్లొద్దాం రమ్మని పిలవగా.. "నేను రాను. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని మోదీ అంకుల్ చెప్పారు" అని చెబుతాడు. అయినా సరే ఆ తల్లి.. "ఏం కాదు. అలా వెళ్లి వెంటనే ఇంటికి వచ్చేద్దాం రా" అని అడగగా.. "మోదీ అంకుల్ చెప్పారు ఇంట్లోనే ఉండమని. బయటకు వెళ్లొద్దని. ఒకవేళ బయటకు వెళ్తే నన్ను అధికారులు తీసుకువెళ్లిపోతారు." అని ముద్దు ముద్దుగా సమాధానం ఇస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ చిన్నారిపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి.. కరోనా సమయంలో 'మైనే ప్యార్ కియా'.. సల్మాన్ ఫన్నీ సీన్!