అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి గర్భిణిగా ఉన్న సమయంలోనూ నాగేశ్వరరావు సినిమా చూడటానికి ఎంతగా ఆరాటపడిందో చెప్పిన మెగాస్టార్... ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
మనం ప్రాణాలతో ఉన్నా, లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండాలని నాగేశ్వరరావుగారు ఈ అవార్డు పెట్టారని చెప్పిన చిరు... ఏదో ఒక రోజుకి దాదా సాహెబ్ ఫాల్కే వంటి గొప్ప అవార్డు అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.