ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవి​ కోసం మరో కథ సిద్ధం - chiru next

లాక్​డౌన్​తో వచ్చిన విరామ సమయంలో చిరు కోసం యువ దర్శకుడు బాబీ కొత్త కథ సిద్ధం చేశారట. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా రానుంది.

మెగాస్టార్ చిరంజీవి​ కోసం మరో కథ సిద్ధం
హీరో చిరంజీవి
author img

By

Published : Jul 14, 2020, 7:03 AM IST

కరోనా పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమలో చిత్రీకరణల సందడి కనిపించనప్పటికీ.. కొత్త కథలు సిద్ధం చేసుకోవడంలో దర్శకులు జోరు చూపిస్తూనే ఉన్నారు. ఈ విరామ సమయాన్ని చక్కగా వినియోగించుకొని చకచకా కొత్త స్క్రిప్ట్‌లు పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు బాబీ కూడా అగ్ర కథానాయకుడు చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ కలయికలో ఓ చిత్రం రానుందని చిరు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడా ప్రాజెక్టు కోసమే బాబీ కథను పూర్తి చేసినట్లు సమాచారం. మెగాస్టార్ శైలికి తగ్గట్లుగానే వైవిధ్యభరితమైన కథాంశంతో అన్నిరకాల వాణిజ్య హంగులతో ఈ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే చిరు ఈ కథ విన్నారని, కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించగా ఇప్పుడు వాటన్నింటినీ బాబీ పూర్తి చేశారని సమాచారం.

megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి

ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రం పూర్తయిన తర్వాతే ఈ సినిమా ప్రారంభంపై స్పష్టత రానుంది. ఎందుకంటే ప్రస్తుతం చిరు కోసం మరో యువ దర్శకుడు సుజీత్‌ 'లూసిఫర్‌' రీమేక్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్‌ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో ముందు సెట్స్‌పైకి వెళ్లాలన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి చిరంజీవి నిర్ణయించుకోనున్నారని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.