కరోనా సోకి ఇటీవలే మరణించి క్యారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. కొవిడ్ వల్ల ఇంటి పెద్ద కోల్పోయిన ఆ కుటుంబానికి చిరు రూ.లక్ష సాయంగా అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు చేతుల మీదుగా ఈ చెక్‌ను వారు అందుకున్నారు. ఈ సందర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడారు.
"చిరంజీవి గారు మాకు ఆపద్భాంధవుడు. ప్రతిసారీ మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. గతంలో నా భర్త (జయరామ్) యాక్సిడెంట్ జరిగితే.. వెంటనే ఉపాసన గారికి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారు. అప్పుడూ మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి నా కుటుంబాన్ని ఆందుకుంటున్నారు. ఇది నా పిల్లలకు పెద్ద సాయం. ఈ సందర్భంగా చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను".
- శోభారాణి, డ్రైవర్ జయరామ్ భార్య
మృతుడు కిలారి జయరామ్.. అతని భార్య కే శోభారాణి దంపతులకు ఇద్దరు కుమారులు కౌశిక్ (18), జస్వంత్(12), కుమార్తె వినోదిని(8) ఉన్నారు.
ఇదీ చూడండి.. ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'ఏక్ మినీ కథ'