ETV Bharat / sitara

సింధుకు చిరు సత్కారం.. ప్రముఖులతో సరదా సరదాగా! - పీవీ సింధుకు సత్కారం

బ్యాడ్మింటన్ స్టార్​ పీవీ సింధును ప్రత్యేకంగా సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు ఇన్​స్టాగ్రామ్​లో సింధును పొగుడుతూ పోస్ట్​ చేశారు.

chiru
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Aug 28, 2021, 8:08 PM IST

రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతోపాటు సీనియర్ కథానాయికలు రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సింధును చూసి దేశం మురిసిపోతుంటే.. ఆమె తన బిడ్డే అనే భావన కలిగిందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చిరు కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న సింధు.. వచ్చే ఒలింపిక్స్​లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని వెల్లడించింది.

chiranjeevi
పీవీ సింధుకు ప్రత్యేక సత్కారం

సింధు మాటలతో మెగాస్టార్ చిరంజీవి పులకించిపోయారు. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి సింధును ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:కొత్త చిత్రంతో రాజ్​తరుణ్.. 'మాస్ట్రో' రిలీజ్ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.