ETV Bharat / sitara

ఆపదలో ఉన్నవారి కోసం చిరంజీవి రక్తదానం

ఇబ్బందులు పడుతున్న రోగుల కోసం ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్​లో ఈరోజు రక్తదానం చేశారు.

ఆపదలో ఉన్నవారి కోసం చిరంజీవి రక్తదానం
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Apr 19, 2020, 3:32 PM IST

Updated : Apr 19, 2020, 6:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. లాక్​డౌన్ వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగుల కోసం, తన వంతు సాయంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్​లో రక్తదానం చేశారు. ఈయనతో పాటు నటులు శ్రీకాంత్, బెనర్జీ, రోషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరంజీవితో పాటు రక్తదానంలో పాల్గొన్న శ్రీకాంత్,రోషన్ తదితరులు

ప్రస్తుత పరిస్థితుల్లో దాతలు ఇంటికే పరిమితమవడం వల్ల రోగులకు, అత్యవసర చికిత్సలకు రక్తం ఇచ్చే వీలుపడటం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి ముందుకొచ్చారు. మిగతా నటీనటులు వీలు చూసుకుని దగ్గర్లోని బ్లడ్​ బ్యాంక్​ల్లో​ రక్తం ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు చిరు. 40 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్​గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రామ్​చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది.

Last Updated : Apr 19, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.