హీరో విజయ్, దర్శకుడు కనగరాజన్ కాంబోలో విడుదలైన 'మాస్టర్' సినిమా అభిమానులను అలరించింది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో 'వాతి కమింగ్' పాట.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరినీ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ పాటే అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ రికార్డును అందుకుందీ పాట. యూట్యూబ్‌లో 100మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుని దూసుకెళ్తోంది. ఈ మాస్ సాంగ్ ఈ మార్క్‌ను అందుకోవడంపై విజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కింగ్ నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికి 11మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్సుఖ్నగర్-2013) నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హీరో నితిన్ నటించిన 'రంగ్ దే' ట్రైలర్ ఆద్యంతం హాస్యభరితంగా ఉంటూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. మార్చి 19న విడుదలైన ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం యూట్యూబ్‌లో 4 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. మార్చి 26 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చడండి: విజయ్ 'మాస్టర్' కాంబినేషన్ మరోసారి!