'మాస్టర్' సినిమాతో కోలీవుడ్ కథానాయకుడు విజయ్ మరో ఘనత సాధించారు. ఈ ఏడాది రూ.200 కోట్ల క్లబ్లో చేరిన తొలి హీరోగా నిలిచారు. థియేటర్లలోకి 50 శాతం ప్రేక్షకులనే అనుమతించినప్పటికీ, 'మాస్టర్' అదరగొడుతున్నాడు. మొత్తంగా ఈ మార్క్‌ను అధిగమించడం విజయ్‌కిది నాలుగోసారి.
జనవరి 9న విడుదలైన 'మాస్టర్'.. తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం హిట్ తెచ్చుకుని దూసుకెళ్తోంది. అక్కడ ఒక్కచోటే ఇప్పటివరకు రూ.110 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. ఆండ్రియా, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 12 నుంచి ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: 'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!