తనకు చెస్ ఆడటమంటే అమితమైన ఇష్టమని చెప్పింది బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. నేడు అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు పోస్ట్ చేసింది. చదరంగం ద్వారా వ్యూహరచన, సృజనాత్మకత అలవడుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి చెస్ ఆడుతున్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నేను చాలా తీవ్రంగా పోటీ పడుతున్నా. అందుకు నా తండ్రే కారణం. ఆయన నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ ఆటలో ఆయనను ఓడించాలని అనుకుంటా. ఒక్కసారి మాత్రమే గెలవగలిగాను. మా నాన్న చెస్‌లో చాలా తెలివైన వ్యక్తి. అందుకే ఆయనతో ఆడేందుకు ఇష్టపడతా. ఎందుకంటే నేను కన్న కూతురైనప్పటికీ.. లోపాలను ఎత్తి చూపడంలో ఎక్కడా సంశయించరు."
-మానుషి చిల్లర్, సినీ నటి
చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన 'పృథ్వీరాజ్' చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన మానుషి కనిపించనుంది. మహారాజ పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మానుషి సన్యోగిత పాత్రను పోషిస్తోంది.