ప్రముఖ దర్శకులు మణిరత్నం-జయేంద్ర.. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 'నవరస' పేరుతో తొమ్మిది లఘచిత్రాల్ని నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని, కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోలీవుడ్ కార్మికుల కోసం వినియోగించనున్నారు.
"మా కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న సినీ పరిశ్రమలోని వ్యక్తులు.. కరోనా ప్రభావంతో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు. వారిని ఆదుకోవడంలో భాగంగా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాం. లఘచిత్రాలు తీసి, వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని సదరు వ్యక్తులకు అందజేస్తాం. ఈ ఆలోచనతో ప్రముఖ దర్శకులు, నటీనటులకు దగ్గరకు వెళ్తే అందరూ మెచ్చుకున్నారు" -మణిరత్నం-జయేంద్ర ప్రకటన
'నవరస' ఆంతాలజీని నటనలోని తొమ్మిది రసాలు(హాస్యం, శృంగారం, కోపం etc..) ఆధారంగా తెరకెక్కించనున్నారు. దీని కోసం ప్రముఖ దర్శకులైన బెజోయ్ నంబియర్, గౌతమ్ మేనన్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రమ్, రతీంద్రన్ ప్రసాద్, హరితా సాలిమ్, అరవింద స్వామి పనిచేయనున్నారు.
వీరితో పాటే 40 మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
- నటీనటులు: అరవింద స్వామి, సూర్య, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు
- రచయితలు: పట్టుకొట్టయ్ ప్రభాకర్, సెల్వ, మదన్ కార్కి, సోమితరన్
- సంగీత దర్శకులు: ఏఆర్ రెహమాన్, ఇమ్మాన్, గిబ్రాన్, అరుల్ దేవ్, కార్తిక్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్, యోహాన్