మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ(Manchu Vishnu Letter) రాశారు. ఈ ఏడాది జరగనున్న 'మా' అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకు బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
-
నా MAA కుటుంబానికి 🙏.To my MAA family 🙏 pic.twitter.com/1TDa3f8lYA
— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నా MAA కుటుంబానికి 🙏.To my MAA family 🙏 pic.twitter.com/1TDa3f8lYA
— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2021నా MAA కుటుంబానికి 🙏.To my MAA family 🙏 pic.twitter.com/1TDa3f8lYA
— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2021
"ఈ ఏడాది జరగనున్న 'మా' అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు 'మా' కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను"
- మంచు విష్ణు, కథానాయకుడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిపాలన భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో తన కుటుంబం 25 శాతం భరిస్తుందని మంచు విష్ణు స్పష్టం చేశారు. "నా తండ్రి మోహన్‌బాబు 'మా' అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. గతంలో 'మా' అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు 'మా' బిల్డింగ్ ఫండ్‌కు నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చాను. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి 'మా' కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను. 'మా' వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్తగా పరిశీలించిన నాకు 'మా' కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. అందుబాటులో ఉంటాం. 'మా' అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నా" అని తన ట్వీట్లో మంచు విష్ణు పేర్కొన్నారు.
ఇదీ చూడండి.. MAA Election: ప్రకాశ్‌రాజ్‌పై విమర్శలకు ఆర్జీవీ కౌంటర్