ETV Bharat / sitara

కంఠం కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌ బాబు

అలవోకగా ఆయన చెప్పే భారీ డైలాగ్​లకు అభిమానులు ఫిదా. ఒక్క చూపుతో, రూపుతో, నడకతో, నటనతో, థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించగల సమ్మోహనత్వం ఆయన సొంతం. అందివచ్చిన ఏ పాత్రనైనా ఆకళింపు, ఆవాహన చేసుకుని అతి సమర్ధవంతంగా ఆవిష్కరించగల సత్తా, సమర్ధత ఆయన సముపార్జించుకున్న ఆస్తి. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్య కథానాయకుడిగా రొటీన్‌కి భిన్నమైన శైలితో ఎన్నో విలక్షణ పాత్రలు వేసిన కలెక్షన్​ కింగ్​. నటుడిగా 575, నిర్మాతగా 80 సినిమాలు తన ఖాతాలో వేసుకోవడమై కాకుండా... ఎన్నో అవార్డులు, రివార్డులు స్వీకరించిన కళాకారుడు. ఆయనే భక్తవత్సలం నాయుడు అలియాస్​ మోహన్​బాబు.

manchu mohan babu birthday special story
కంఠం కంచు.. మనసు మంచు.. ఆయనే మన మోహన్‌ బాబు
author img

By

Published : Mar 19, 2020, 5:49 AM IST

భక్తవత్సలం నాయుడు.. అనగానే కొద్దిమందికే తెలుస్తుంది. అదే మోహన్‌బాబు అనగానే ప్రేక్షకులందరి కళ్లలో ఆయన బొమ్మ కనిపిస్తుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీళ్లు రీళ్లుగా కదలాడి వారి పెదాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. ఎక్కడో... రాయలసీమ చిత్తూరు ప్రాంతంలోని మారుమూల పల్లెలో పుట్టి పెరిగినా... తెరపై తనని తాను ఆవిష్కరించుకోవాలనే సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఆ దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమించి, మరెన్నో మైలురాళ్లను దాటి విజేతగా నిలిచాడు. అందుకే ఆయన యువ సినీతారలకు స్ఫూర్తిగా చెప్తుంటారు.

manchu mohan babu birthday special story
తల్లి దండ్రులతో మోహన్​ బాబు

సీమ బిడ్డ

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మర్చి 19న భక్తవత్సలం నాయుడు జన్మించారు. తండ్రి మంచు నారాయణస్వామి, తల్లి లక్షమ్మ. తండ్రి ఉపాధ్యాయుడు. మోహనబాబుకి రంగనాధ్‌ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్లున్నారు. సోదరి విజయ కూడా ఉంది. ఏర్పేడు, తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన భక్తవత్సలం నాయుడు చెన్నై వైఎంసీఏ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కొంతకాలం తన తండ్రిలాగానే ఉపాధ్యాయ వృత్తి భాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రంగుల ప్రపంచం మీద మక్కువ ఎక్కువ కావడం వల్ల ఆయన మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరి కొంతకాలం శిక్షణ పొందాడు. తరువాత సినీ అవకాశాల వేటలో పడ్డాడు. సినిమాల్లో పనిచేయాలనే అభిరుచి ఉన్నప్పటికీ ఇండస్ట్రీ రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలకలేదు. ఆయన ఓర్పును పరీక్షించింది. స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నాలు ఫలించి 1969లో దర్శకుడు లక్ష్మీ దీపక్‌ దగ్గర నుంచి అప్రెంటీస్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకున్నాడు. అదీ ఆయనకు దక్కిన మొదటి అవకాశం. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా వెనువెంటనే లక్ష్మీ దీపక్‌ దగ్గర అప్రెంటీస్‌గా చేరిపోయాడు. అలా కొంత కాలం తెర వెనుక దర్శకత్వశాఖలో పనిచేశాడు. 1974లో 'కన్నవారి కలలు', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాల్లో కాసేపు కనిపించే అవకాశం ఆయన్ని వరించి వచ్చింది. ఆ సమయంలోనే టాలీవుడ్‌లో స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడింది.

దాసరితో మోహన్​ బాబు

'స్వర్గం-నరకం'తో గుర్తింపు

దాసరి నారాయణరావు దర్శకుడిగా మారిన సందర్భంలో భక్తవత్సలం నాయుడికి కూడా ఆ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. అదే'స్వర్గం-నరకం' చిత్రం. సంసారం స్వర్గ సీమ కావాలన్నా, నరక కూపం అవ్వాలన్నా భార్యాభర్తల చేతుల్లోనే ఉందనే సందేశాత్మక చిత్రం అది. అప్పట్లో ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దర్శకుడిగా దాసరి అభిరుచికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే సమయంలో ఆ చిత్రంలోని నటీనటులకు తగిన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ పోషించిన భక్తవత్సలం నాయుడు మోహన్‌బాబు అనే తెర నామంతో తర్వాతర్వాత ప్రసిద్ధి పొందాడు. ఆ తరువాత కామెడీ విలన్‌గా కొన్ని చిత్రాల్లో మోహన్‌బాబు నటించాడు. అలనాటి మేటి నటుల సమక్షంలో విలన్‌గా నటించాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్‌ చిత్రాల్లో కూడా చెప్పుకోదగ్గ పాత్రలు వేశాడు. 'ఖైదీ కాళిదాసు' చిత్రంలో కీలక భూమిక పోషించాడు. నెమ్మదిగా ప్రతినాయకుడి పాత్రల నుంచి కథానాయక పాత్రలకు మోహన్‌బాబు షిఫ్ట్‌ అయ్యాడు. 1980 దశకం మోహన్‌ బాబు ఎదుగుదలకు ఎంతో ఉపకరించింది. 1980లో 'త్రిలోక సుందరి', 'సీతారాములు', 1981లో 'టాక్సీ డ్రైవర్‌', 1982లో 'సవాల్‌', 1983లో 'ప్రళయ గర్జన', 1984లో 'సీతమ్మ పెళ్లి', 1985లో 'తిరుగుబోతు', 1987లో 'విశ్వనాథ నాయకుడు', 1988లో 'ఆత్మకథ' 1989లో 'బ్లాక్‌ టైగర్‌', 1990లో 'ప్రాణానికి ప్రాణం'లాంటి సినిమాలో గుర్తింపు పొందే పాత్రలు వేశాడు. 1992లో 'డిటెక్టీవ్‌ నారద', 1997లో 'వీడెవడండీ బాబు' లాంటి కామెడీ హీరో పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే, 2002లో 'తప్పు చేసి పప్పు కూడు', 2013లో 'పాండవులు పాండవులు తుమ్మెద' లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించాడు.

మోహన్​ బాబు

సూపర్‌ హీరో స్టేటస్‌

1978లో దాసరి నారాయణరావు చిత్రం 'శివ రంజని' మోహన్‌బాబుకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఎన్నో చిత్రాలు చేస్తూ వస్తున్నా... 1990 నుంచి మోహన్‌ బాబుకి సూపర్‌ స్టార్‌ స్టేటస్‌ వచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు. 1991లో 'అసెంబ్లీ రౌడీ' మోహన్‌బాబు కెరీర్లో బిగ్‌ హిట్‌. అంతకు ముందు 1990లో వచ్చిన 'అల్లుడుగారు' చిత్రం కూడా మెచ్చు తునక. 1991లో 'రౌడీగారి పెళ్ళాం', 1992లో 'అల్లరి మొగుడు', 1995లో 'పెద్ద రాయుడు' చిత్రాలు బాక్సాపీస్‌ దగ్గర సూపర్‌ సక్సెస్‌ కావడంతో...కలెక్షన్‌ కింగ్‌ అనే విశేషణంతో మోహన్‌బాబు విఖ్యాతి పొందారు. అదే సమయంలో క్లిష్టమైన డైలాగ్‌ని విలక్షణంగా పలకడంతో డైలాగ్‌ కింగ్‌ అనే మరో విశేషణం కూడా ఆయన పేరుకు ముందు చేరింది. ఇప్పటికీ ఆ రెండు విశేషణాలతోనే మోహన్‌బాబుని అయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. హై ఎనర్జీ యాక్టింగ్‌తో తనకు తానేసాటి అని నిరూపించుకున్న మోహన్‌బాబు చిత్రాల్లో చాలా చిత్రాలు కలెక్షన్‌ వర్షాన్ని కురిపించాయి. 'కొదమ సింహం', 'బ్రహ్మ', 'చిట్టెమ్మ మొగుడు', 'ఎం ధర్మరాజు ఎం.ఏ', 'అడవిలో అన్న', 'లంకేశ్వరుడు', 'కలెక్టర్‌ గారు', 'మేజర్‌ చంద్రకాంత్‌', 'సోగ్గాడి పెళ్ళాం', 'అన్నమయ్య', 'రాయుడు', 'శ్రీ రాములయ్య', 'పోస్ట్ మాస్టర్ '...ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మోహన్‌బాబు ప్రేక్షకులను అలరించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గురువు దాసరి...హితుడు రజని

దర్శకుడు దాసరి నారాయణరావుని మోహన్‌బాబు గురువుగా భావిస్తాడు. సినీపరంగానే కాకుండా, వ్యక్తిగత విషయాలను కూడా చనువుగా దాసరి దగ్గర చర్చించి తగిన సలహాలు, సూచనలు స్వీకరించేవాడు. ఈ సంగతి వీలు చిక్కినప్పుడల్లా ఆయనే స్వయంగా అనేకసార్లు వెల్లడించారు. ఇక, తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చిత్రసీమలో మోహన్‌బాబుకు అత్యంత శ్రేయోభిలాషి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు కూడా. ఆ స్నేహ ధర్మంతోనే రజినీకాంత్‌ 'పెద్ద రాయుడు' సినిమాలో కీలక పాత్ర పోషించి... ఆ చిత్ర విజయానికి తనవంతు చేయూత ఇచ్చాడు. గాయకుడు యేసుదాస్‌ అంటే కూడా మోహన్‌బాబుకు ఎంతో ఇష్టం. తన చిత్రంలో యేసుదాస్‌తో పాడించడం ఆనవాయితీగా చేసుకున్నాడు.

నిర్మాతగా మోహన్‌బాబు

అభిరుచి గల నిర్మాతగా కూడా మోహన్‌బాబు తనని తాను నిరూపించుకున్నారు. తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై 80 చిత్రాలు నిర్మించాడు. 1992లో నిర్మాణ సంస్థను ప్రారంభించిన మోహన్‌బాబు మొదటి చిత్రంగా 'ప్రతిజ్ఞ' విడుదల చేసాడు. ఆ చిత్రం విజయం సాధించడం వల్ల అదే బ్యానర్‌పై 80 చిత్రాలు తీశాడు. వాటిలో చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నా.. 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీగారి పెళ్ళాం', 'అల్లుడుగారు', 'మేజర్‌ చంద్రకాంత్‌', 'పెద్ద రాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి' లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

యుక్త వయసులో మోహన్​బాబు

విద్యావేత్తగా

మోహన్‌బాబుకు విద్యారంగం అంటే ఎంతో ప్రీతి. 1992లో శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి రెండు ఇంటర్నేషనల్‌ స్కూల్స్, అయిదు కాలేజీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి మెండు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభం ఉంది.

అబ్దల్​ కలామ్​ చేతుల మీదుగా అవార్డు

అవార్డులు-రివార్డులు

2007లో మోహన్‌బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1995లో 'పెద్ద రాయుడు'లో ప్రదర్శించిన నటనకుగాను ఫిలిం ఫేర్‌ సౌత్‌ ఉత్తమ నటుడి అవార్డుతో సన్మానించింది. 2008లో 'యమదొంగ' సినిమాలో నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా సినిమా అవార్డు దక్కింది. 2016లో ఫిలిం ఫేర్‌ సౌత్‌ మోహన్‌బాబుని జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. 2017లో సైమా స్పెషల్‌ అప్రిషియేషన్‌ అవార్డుని మోహన్‌బాబు అందుకున్నాడు. టీఎస్సార్‌ కళాపరిషత్‌ 'నట వాచస్పతి' అవార్డుతో సత్కరించింది. 2018 జనవరిలో టీఎస్సార్‌ కాకతీయ కళాపీఠం 'విశ్వనట సార్వభౌమ' పురస్కారాన్ని మోహన్‌బాబు అందుకున్నాడు. 2017 అక్టోబర్‌ 5న చెన్నైలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ని మోహన్‌బాబు అందుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.