నవ్వించాలంటే 'బిందాస్'గా కెమెరా ముందుకొస్తారు మంచు మనోజ్. యాక్షన్ కథలైతే చాలు.. 'పోటుగాడు'గా మారిపోయి పాత్రల్ని రక్తి కట్టిస్తారు. 'నేను మీకు తెలుసా?', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా?' అంటూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం కూడా ఆయనకి తెలుసు. 'కరెంటుతీగ'లో ఉన్నంత పవర్ మనోజ్‌లో కనిపిస్తుంటుంది. మంచు కుటుంబ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయన మాస్ కథానాయకుడిగా ఎదిగారు. సినిమానే నరనరాన నింపుకున్న మనోజ్ పుట్టినరోజు ఈరోజు.
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు రెండో కుమారుడైన మంచు మనోజ్ మే 20 1983లో జన్మించారు. సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అందుకున్న మనోజ్.. చిన్నప్పుడే 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటుంటారు మనోజ్.
ఆ తర్వాత 'అడవిలో అన్న', 'ఖైదీగారు' చిత్రాల్లోనూ బాలనటుడిగా మెరిశారు. 2004లో 'దొంగ దొంగది' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'శ్రీ', 'రాజుభాయ్', 'నేను మీకు తెలుసా?', 'ప్రయాణం', 'బిందాస్', 'వేదం', 'ఝుమ్మంది నాదం', 'మిస్టర్ నూకయ్య', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', 'పోటుగాడు', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'కరెంట్ తీగ', 'దొంగాట', 'శౌర్య', 'అటాక్', 'గుంటూరోడు', 'ఒక్కడు మిగిలాడు'లో నటించారు. ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' చిత్రం చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">