'వి' అనే ఒకే ఒక్క అక్షరంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాడు దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి. యువ కథానాయకులు నాని, సుధీర్ బాబులతో ఇతడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, అతిథి రావు హైదరీ నాయికలు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.
'మనసు మరీ' అంటూ సాగే ఈ మెలోడి శ్రోతల్ని మైమరపిస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అచ్చ తెలుగును వినిపిస్తోంది. "కిలాడి కోమలి, 'గులేబకావళి, సుఖాల జావళి, వినాలి కౌగిలి" వంటి పదాలు వినిసొంపుగా అలరిస్తున్నాయి. అమిత్ త్రివేది సంగీతం అందించగా, అమిత్‌త్రివేది, శాషా తిరుపతి, యాజిన్ నిజార్ ఆలపించారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">