యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నారట.
'ఆదిపురుష్'లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో హీరోయిన్ కీర్తి సురేశ్ నటించనున్నారని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఆదిపురుష్' పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను 3డీ ఎఫెక్ట్‌లో తెరకెక్కించబోతుండటం విశేషం.