ETV Bharat / sitara

Sridevi soda center: బావపై మహేశ్‌ ప్రశంసల వర్షం - సుధీర్​బాబు

'శ్రీదేవి సోడా సెంటర్​' (sridevi soda center) చిత్రంలో సుధీర్​ నటన అద్భుతంగా ఉందన్నారు సుపర్​స్టార్​ మహేశ్​బాబు. ట్విట్టర్​ వేదికగా చిత్రబృందంలోని ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు.

sridevi soda center
Sridevi soda center: బావపై మహేశ్‌ ప్రశంసల వర్షం
author img

By

Published : Aug 28, 2021, 2:48 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన బావ సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'శ్రీదేవి సోడా సెంటర్‌' (sridevi soda center) చిత్రంలో సుధీర్‌ నటన అద్భుతంగా ఉందంటూ పొగిడారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌.. తాజాగా ట్విటర్‌ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చిత్రబృందంలోని ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు. మిస్‌ కాకుండా అందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు.

  • #SrideviSodaCenter... a raw and intense film with a hard-hitting climax. Director @Karunafilmmaker comes up with yet another bold film after Palasa 1978. @isudheerbabu, is absolutely brilliant!! His finest performance till date 👏👏👏

    — Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"క్లిష్టతరమైన క్లైమాక్స్‌తో అద్భుతమైన ప్రేమకథా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్‌'. 'పలాస 1978' తర్వాత కరుణకుమార్‌ మరోసారి సామాజిక కోణంలో చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సుధీర్‌ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే 'సూరిబాబు' పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు బాగుంది. నరేశ్‌ మరోసారి తన నటనతో మెప్పించేశారు. ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రీదేవి పాత్రకు ఆమె పర్‌ఫెక్ట్‌గా సరిపోయారు. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయి. ఈ చిత్రాన్ని మిస్ కాకండి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు"

-మహేశ్‌ బాబు​

అపురూపమైన ప్రేమకథతో తెరకెక్కిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్‌'. సుధీర్‌బాబు-ఆనంది జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. సమాజంలో కుల వ్యవస్థ.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపించారు. మణిశర్మ స్వరాలు అందించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా నిర్మించారు.

ఇదీ చదవండి : పండుగ రోజున 'సీటీమార్​'.. 'లవ్​స్టోరీ' లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.