టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ సినిమా ద్వారా శ్రద్ధా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అయితే ఈ నటికి నచ్చిన తెలుగు హీరో మహేశ్ బాబు అని తెలిపింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తెలుగు హీరోల్లో మీరు అభిమానించే వారెవరు అని అడగ్గా.. మహేష్ బాబు అని చెప్పింది. ప్రభాస్ గురించి చెప్పమంటే.. మంచి స్నేహితుడని తెలిపిందీ నాయిక. ప్రభాస్‌తో నటిస్తూ మరో హీరో పేరు చెప్పడం వల్ల ప్రభాస్ అభిమానులు నిరాశ చెందారట.
ఈ విషయంపై కొందరు.. "ఒక హీరోతో నటిస్తున్నంత మాత్రాన తనకు ఇష్టమైన నటుడి పేరు చెప్పడంలో తప్పేముంది? ఎవరి అభిప్రాయం వారిది" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది 'సాహో'. మరి తెలుగు ప్రేక్షకులను శ్రద్ధా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవీ చూడండి.. సినిమాలే నా జీవితం కాదు: కాజల్