Mahesh babu movies: కెరీర్ పరంగా తనను తాను సరిదిద్దుకునేందుకు మూడేళ్లు విరామం తీసుకున్నానని, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఫిబ్రవరి 4న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఎపిపోడ్‌కు సంబంధించిన కొత్త ప్రోమో గురువారం విడుదలైంది. సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమో విశేషంగా అలరిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ!" అని బాలకృష్ణ అడగ్గా మహేశ్ నవ్వులు చిందించారు. తన సినిమాల్లోని ఏదైనా డైలాగ్ చెప్పమని బాలకృష్ణ మహేశ్‌ను కోరగా "మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సర్" అని సమాధానమిచ్చారు. ఒకానొక సందర్భంలో కెరీర్లో మూడేళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మహేశ్ వివరించారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గురువారమే లాంఛనంగా ప్రారంభమైంది.

ఇవీ చదవండి: