ETV Bharat / sitara

మహేశ్​బాబును భయపెట్టిన హారర్ సినిమా ఇదే

సూపర్​స్టార్​ మహేశ్​బాబును 'ది సోషల్​ డైలమా' అనే హారర్​ చిత్రం ఎంతగానో భయపెట్టిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని చెప్పారు.

author img

By

Published : Oct 6, 2020, 8:53 PM IST

Mahesh
మహేశ్

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు సినిమా విడుదలైందంటే చాలు అతని అభిమానుల సందడే వేరు. థియేటర్​కు వచ్చిన ఒక్కో చిత్రం కనీసం 100 కోట్లను వసూలు చేసి కానీ తిరిగి వెళ్లదు. అలాంటి మహేశ్​ మెచ్చిన చిత్రం.. అది కూడా అతడ్ని భయపెట్టిన సినిమా ఏంటో తెలుసా?.

ఇటీవల కాలంలో తనను ఎంతగానో భయపెట్టిన చిత్రం 'ది సోషల్​ డైలమా' అని మహేశ్​ ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. "ఒక ప్రేక్షకుడిగా, అభిమానిగా నేను ఎన్నో చిత్రాలను చూశా. కానీ నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన 'ది సోషల్​ డైలమా' నన్ను ఎంతగానో భయపెట్టింది. ఇప్పుడు కూడా ఆ సినిమా నాలో వణుకు పుట్టిస్తోంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా." అని మహేశ్​ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

  • I’ve seen many horror films and have been a fan of the genre... ’Social Dilemma‘ on @netflix is the most scariest of them all !! It's still giving me the chills as I write this... A MUST WATCH! pic.twitter.com/dwP9SlwaMl

    — Mahesh Babu (@urstrulyMahesh) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాస్తవానికి ఈ సినిమా హారర్​ నేపథ్యంలో తెరక్కింది కాదు. సామాజిక మాధ్యమాల వెబ్​సైట్ల వల్ల సంభవించే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.