సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ప్రిన్స్.
"అంతా ఇక్కడే మొదలైంది. 1989.. 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా సెట్లో. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో పనిచేస్తున్నాను. జీవితచక్రానికి ఇదే నిదర్శనం". -ట్విట్టర్లో హీరో మహేశ్‌బాబు
'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు సూపర్‌స్టార్ కృష్ణ. అందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేశాడు. అతడి తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ఆ సమయంలో ఈ ఫొటో తీశారు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు విజయశాంతి-మహేశ్ కలిసి నటిస్తున్నారు.
'సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్గా రష్మిక మందణ్న నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. మహేశ్‌బాబుతో కలిసి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి: