ETV Bharat / sitara

Krishna Birthday: బుర్రిపాలెంలో మహేశ్ టీకా డ్రైవ్ - కొవిడ్​ వాక్సినేషన్​ స్పాన్సర్​ మహేశ్​బాబు

సూపర్​స్టార్​ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను స్పాన్సర్​ చేశారు హీరో మహేశ్​బాబు. గతంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సహా అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం అక్కడున్న ప్రజలకు కరోనా వాక్సిన్​ వేయించేందుకు ముందుకొచ్చారు.

Mahesh Babu sponsors COVID-19 vaccines for an entire village on his father Krishna's birthday
కృష్ణ పుట్టినరోజున బుర్రిపాలెం ప్రజలకు వాక్సినేషన్​
author img

By

Published : May 31, 2021, 3:16 PM IST

సూపర్​స్టార్ మహేశ్​ బాబు తన స్వగ్రామమైన బుర్రిపాలెంను గతంలోనే దత్తత తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వీటితో పాటు మరికొన్ని సేవాకార్యక్రమాలను చేపట్టారు. అయితే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఒక్క బుర్రిపాలెంకే పరిమితం కాకుండా.. ఇప్పటివరకు వేయి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. హీల్​ ఏ చైల్డ్​ ఫౌండేషన్​ సంస్థతో కలిసి ఆర్థిక సమస్యలున్న కుటుంబాల చిన్నారులకు మహేశ్​ అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం(మే 31)న తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెంలోని ప్రజల కోసం కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రైవ్​ను స్పాన్సర్​ చేశారు మహేశ్​. ఆంధ్ర హాస్పిటల్​ సహకారంతో ఈ ప్రత్యేక డ్రైవ్​ను నిర్వహించారు. మహేశ్​బాబు.. ఆంధ్రప్రదేశ్​లోని బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను​ దత్తత తీసుకున్నారు.

ఇదీ చూడండి: KRISHNA BIRTHDAY: సూపర్​స్టార్ కృష్టకే సొంతమైన ఆ ఘనతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.