సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ముందే చెప్పినట్లు జనవరి 13న కాకుండా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్'(rrr teaser), 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్'(bheemla nayak song download) ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్(keerthy suresh movies) నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో(trivikram next movie) కలిసి పనిచేస్తారు మహేశ్. వీరి కాంబినేషన్లో రాబోయే మూడో చిత్రమిది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన 'అతడు', 'ఖలేజా'.. ప్రేక్షకులను ఎంతలా ఆదరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ అనేసరికి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde movies). తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
ఇవీ చదవండి: