'ఆర్ఆర్ఆర్'(rrr release date) డైరెక్టర్ రాజమౌళి తర్వాత సినిమా(rajamouli next movie) ఎప్పుడో ఫిక్సయింది. సూపర్‌స్టార్ మహేశ్‌తో(mahesh babu new movie) ఆయన కలిసి పనిచేస్తారని గతంలో రాజమౌళినే స్వయంగా ప్రకటించారు. అప్పటినుంచి పలానా కథతో, పలానా చోట తీస్తారు అంటూ పలు ఊహాగానాలు కూడా వచ్చాయి. అవన్నీ పక్కనపెడితే ఇప్పుడు మహేశ్ కూడా ఈ సినిమా గురించి స్పష్టత ఇచ్చారు.
"నేనెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తాను. హిందీలో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం. నా తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నా. ఇది అన్ని భాషల్లో ఉంటుంది" అని మహేశ్‌బాబు(mahesh babu new movie), ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమధానమిస్తూ ఇలా చెప్పారు.

'ఆర్ఆర్ఆర్'(rrr songs) వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తర్వాత మహేశ్-రాజమౌళి సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) చేస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తుంది.
అయితే ఈ సినిమా అడ్వెంచర్ కథతో తెరకెక్కనుందని, ఆఫ్రికా అడవుల్లో తీస్తారని ప్రచారమూ గతంలో ఉంది. కానీ రాజమౌళి మన దగ్గర కాకుండా విదేశీ నేపథ్య కథతో ఇప్పటివరకు సినిమా తీయలేదు. మరి మహేశ్ చిత్రంతో ఆ ప్రయోగం చేస్తారేమో చూడాలి!
'ఆర్ఆర్ఆర్' ప్రకటించిన తర్వాత థియేటర్లలోకి రావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టనుంది. దీంతో మహేశ్ సినిమా ఇంకెన్నాళ్లు పడుతుందో అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి: