సూపర్‌స్టార్ మహేశ్‌కు కొత్త క్యారవాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపై ఆయన సినిమా లొకేషన్స్‌లో ఈ కొత్త వాహనం తళుక్కున మెరవనుందట. ఈ మేరకు వ్యాన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడిన మామూలు క్యారవాన్‌ను ఉపయోగిస్తున్న మహేశ్.. తన అభిరుచికి తగినట్లు ఆధునిక హంగులతో ఈ వాహనాన్ని సిద్ధం చేయించుకున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.
అంతేకాకుండా క్యారవాన్ ఇంటీరియర్ డిజైన్ల కోసం ఓ ముంబయి కంపెనీ ఎంతో శ్రమించిందని.. మహేశ్ కూడా భారీగానే ఖర్చు పెట్టారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ క్యారవాన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మహేశ్ ప్రస్తుతం 'సర్కారువారి పాట' షూట్‌లో పాల్గొంటున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రస్తుతం ఈ షూట్ దుబాయ్‌లో జరుగుతోంది. మహేశ్-కీర్తిలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'సర్కారువారి పాట' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' కోసం మళ్లీ దుబాయ్‌కు