ETV Bharat / sitara

Mahesh Babu Mohan Babu: మహేశ్​ సినిమాలో మోహన్​బాబు! - trivikram

Mahesh Babu Mohan Babu: దాదాపు మూడు దశాబ్దాల అనంతరం సూపర్​స్టార్​ మహేశ్​ బాబు-విలక్షణ నటుడు మోహన్​బాబు కలిసి నటించనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మోహన్​బాబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

mahesh babu mohan babu
మహేశ్​ బాబు
author img

By

Published : Jan 25, 2022, 8:29 PM IST

Mahesh Babu Mohan Babu: సూపర్​స్టార్​ మహేశ్​ బాబుతో కలిసి నటించనున్నారట సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్​ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మహేశ్​ మావయ్యగా మోహన్​బాబు కనిపించనున్నారని సమాచారం.

mahesh babu mohan babu
SSMB 28 టీమ్

ఇదే నిజమైతే దాదాపు 33 ఏళ్ల తర్వాత మోహన్​బాబుతో కలిసి మహేశ్ నటించినట్లు అవుతుంది. 1989లో స్వీయ నిర్మాణంలో సూపర్​స్టార్ కృష్ణ నటించి, దర్శకత్వ వహించిన 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో వీరు చివరిసారిగా కలిసి నటించారు. ఇందులో చైల్డ్​ ఆర్టిస్ట్​గా తొలిసారి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు మహేశ్.

pooja hegde
పూజా హెగ్డే

ఇక మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో రానున్న మూడో చిత్రమిది. ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాలతో ప్రేక్షకులను అలరించిందీ ద్వయం. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందించనున్నాడు. పూజా హెగ్డే కథానాయిక.

ఇదీ చూడండి: బాలయ్యతో మహేశ్.. అన్​లిమిటెడ్ పంచ్​లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.