పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. బాలీవుడ్లో తెరకెక్కిన 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమన్ స్వరాలు అందించారు. సినీ ప్రియులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్' ప్రమోషన్లో చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు తొలుత 'వకీల్‌సాబ్' కాకుండా 'మగువా' అనే టైటిల్‌ను అనుకున్నారట. ఆ తర్వాత దాన్ని మార్పు వెనుకున్న కారణాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు దర్శకుడు వేణు శ్రీరామ్.
"ఈ కథ సిద్ధమవ్వుగానే మొదట 'మగువా' అనే టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత పవర్‌స్టార్‌ని దృష్టిలో ఉంచుకొని 'వకీల్‌సాబ్' టైటిల్ ఫిక్స్ చేశాం. ఇందులోని 'మగువా' పాటకు రామజోగయ్య అందించిన లిరిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. సాధారణమైన భాషలో ఈ పాట రాశారు. మొదట ఈ పాట వినగానే కన్నీళ్లు వచ్చేశాయి. నా మూడేళ్ల పాప కూడా ఈ పాట పాడుతుంది."
- వేణు శ్రీరామ్, దర్శకుడు
ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.
ఇదీ చూడండి: 'వకీల్‌సాబ్'లో పవన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!