ETV Bharat / sitara

వెబ్​సిరీస్​గా మధుబాబు 'షాడో' నవల

author img

By

Published : Jun 26, 2020, 5:55 PM IST

ప్రసిద్ధ తెలుగు నవల 'షాడో' ఆధారంగా ఓ వెబ్​సిరీస్​ రూపొందనుంది. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​ ఈ సిరీస్​ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించింది.

Madhubabu shadow Novel as Shadow web series
షాడో

తెలుగు సాహితీ ప్ర‌పంచంలో మ‌ధుబాబు 'షాడో' న‌వ‌ల‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ న‌వ‌ల‌ల‌కు వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇవి దృశ్య‌రూపంలోకి రానున్నాయి. ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ వీటిని వెబ్ సిరీస్​గా తెరకెక్కించేందుకు సిద్ధమైంది. 'మధుబాబు షాడో' పేరుతో రూపొందించనున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

  • "You read about him in the 20th century. You will now see him with the same attitude in 21st century". Thanks MadhuBabu garu for trusting in us to give a visual format for the biggest novel franchise of India. #SHADOWSERIES pic.twitter.com/hrtURBQEwa

    — Anil Sunkara (@AnilSunkara1) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"You read about him in the 20th century. You will now see him with the same attitude in 21st century". Thanks MadhuBabu garu for trusting in us to give a visual format for the biggest novel franchise of India. #SHADOWSERIES pic.twitter.com/hrtURBQEwa

— Anil Sunkara (@AnilSunkara1) June 26, 2020

"20వ శతాబ్దంలో అతడి గురించి చదివారు. అదే ఆటిట్యూడ్​తో 21 శతాబ్దంలో అతడిని చూడబోతున్నారు. మా మీద నమ్మకం ఉంచి 'షాడో' కథలకు దృశ్యరూపం ఇవ్వడానికి అనుమతించినందుకు మధుబాబు గారికి ధన్యవాదాలు."

-అనిల్ సుంకర, నిర్మాత

ఈ సిరీస్​లో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారని టాక్. ఇప్ప‌టికే ఓ ఓటీటీ సంస్థ‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల్ని ప్ర‌క‌టించి, ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సాహితీ ప్ర‌పంచంలో మ‌ధుబాబు 'షాడో' న‌వ‌ల‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ న‌వ‌ల‌ల‌కు వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇవి దృశ్య‌రూపంలోకి రానున్నాయి. ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ వీటిని వెబ్ సిరీస్​గా తెరకెక్కించేందుకు సిద్ధమైంది. 'మధుబాబు షాడో' పేరుతో రూపొందించనున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

  • "You read about him in the 20th century. You will now see him with the same attitude in 21st century". Thanks MadhuBabu garu for trusting in us to give a visual format for the biggest novel franchise of India. #SHADOWSERIES pic.twitter.com/hrtURBQEwa

    — Anil Sunkara (@AnilSunkara1) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"20వ శతాబ్దంలో అతడి గురించి చదివారు. అదే ఆటిట్యూడ్​తో 21 శతాబ్దంలో అతడిని చూడబోతున్నారు. మా మీద నమ్మకం ఉంచి 'షాడో' కథలకు దృశ్యరూపం ఇవ్వడానికి అనుమతించినందుకు మధుబాబు గారికి ధన్యవాదాలు."

-అనిల్ సుంకర, నిర్మాత

ఈ సిరీస్​లో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారని టాక్. ఇప్ప‌టికే ఓ ఓటీటీ సంస్థ‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల్ని ప్ర‌క‌టించి, ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.