'పుష్ప'(pushpa allu arjun movie) చిత్ర బృందం అదిరిపోయే అప్టేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాట 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ'కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది. పూర్తి పాటను నవంబర్ 19న రిలీజ్ చేయనుంది. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రెండో హీరోహిన్గా కేథరిన్..
ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ కథానాయకునిగా (movie latest news) తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. మరో హీరోహిన్ కూడా సినిమాలో నటించనుందనే ఊహాగానాలను నిజం చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో రెండో హీరోహిన్గా కేథరిన్ థెరిసా నటించనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఆమె లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సింగీతాన్ని అందిస్తుండగా.. నితిన్ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

'నాటు నాటు' వెరీ ఫాస్ట్..
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ (natu natu song rrr) దుమ్మురేపుతోంది. అతి తక్కువ సమయంలోనే నలభై లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హోటల్స్, షాపింగ్ మాల్స్, సెలూన్స్.. ఇలా ఎక్కడా విన్నా.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎందులో చూసినా 'నాటు నాటు' పాటే రిపీట్ అవుతోంది. సంగీతానికి తోడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల డ్యాన్స్ మేనియా అలాంటిది మరి! ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని గీతమిది. నవంబరు 10న విడుదలైంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న(rrr release date) విడుదల కానుంది. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు.
కురుప్ కుమ్మేసింది..
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కొత్త సినిమా 'కురుప్'(Kurup movie collections) వసూళ్లలో సరికొత్త మైలురాయిని చేరింది. యూభై కోట్ల కలెక్షన్స్ చేసింది. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. సుశీన్ శ్యామ్ స్వరాలు అందించాడు. వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

ఇదీ చదవండి:LIVE: బెంగళూరులో పునీత్ రాజ్‌కుమార్‌కు చిత్రపరిశ్రమ నివాళులు