ETV Bharat / sitara

MAA elections: 'వారిపై చర్యలు తీసుకోవాలి'

'మా' అసోసియేషన్​ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు పలువురు సభ్యులు. అలాగే ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయనను కోరారు.

maa elections
మా ఎలక్షన్స్​
author img

By

Published : Aug 14, 2021, 3:20 PM IST

తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. 'మా' అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు.

మా ఎలక్షన్స్​

ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్​పై కొంతమంది సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం సబబుగా లేదన్న మానిక్.. మా అసోసియేషన్​ను చులకనగా చేసి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరారు. 110 మంది సభ్యుల మద్దతు విష్ణుకు ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: MAA Elections 2021: నటి హేమకు షోకాజ్ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.