మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో(MAA Elections 2021) అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని నటుడు మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 'మా' అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విష్ణు ఇటీవల తన ప్యానల్(Manchu Vishnu Panel For MAA) ప్రకటించారు. తాజాగా ఆయన(Manchu Vishnu news) ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్య చేశారు.
" 'మా' కు(MAA building) శాశ్వత భవనం లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే 'మా' భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తా. నిర్మాతగా దెబ్బతిన్నప్పటికీ.. అప్పు తీసుకువచ్చి దాన్ని నిర్మిస్తాను. కొత్త నటీనటులు ఎక్కువమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటా. సినీయర్ నటీనటులకు అన్నిరకాలుగా అండగా ఉంటా. నటీనటుల పిల్లల చదువుల కోసం సాయం అందిస్తా. ఇలా ప్రతి విషయంపై నేను స్పష్టతతో ఉన్నా. ప్రకాశ్‌రాజ్(maa elections prakash raj panel) కంటే కూడా నేను బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలను. అందుకే పోటీలోకి దిగాను. ఇప్పటివరకూ మెగాస్టార్ చిరంజీవిని కలవలేదు. నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించి.. చిరును కలుస్తాను. నా విజన్ విన్నాక ఆయన తప్పకుండా నాకు ఓటు వేస్తారనుకుంటున్నా. ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్‌లకు ఫోన్ చేసి.. మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు" అని విష్ణు వివరించారు.
ఇదీ చూడండి: వాళ్లు చెప్తేనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: విష్ణు