ETV Bharat / sitara

'మోహన్​బాబు మమ్మల్ని బూతులు తిట్టారు'.. బెనర్జీ, తనీశ్​ ఆవేదన - Prakash Raj Panel Resigns

'మా' ఎన్నికల్లో పరిణామాలను వెల్లడిస్తున్న క్రమంలో మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు నటుడు బెనర్జీ. తనతో పాటు హీరో తనీశ్​ను​ సీనియర్​ నటుడు మోహన్​ బాబు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

'మోహన్​బాబు మమ్మల్ని బూతులు తిట్టారు'.. బెనర్జీ, తనీష్​ ఆవేదన
author img

By

Published : Oct 12, 2021, 6:07 PM IST

Updated : Oct 12, 2021, 6:39 PM IST

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వెల్లడిస్తూ కంటతడి పెట్టుకున్నారు. సీనియర్​ నటుడు మోహన్​బాబు.. తనతో పాటు హీరో తనీశ్​​ను దూషించినట్లు వెల్లడించారు.

"నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబుగారు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి 'గొడవలు వద్దు నాన్నా' అని అన్నాను. అది విన్న మోహన్‌బాబుగారు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుగారికి వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. వాళ్ల ఇంటికి వెళ్తే, మంచు లక్ష్మీను, విష్ణును ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి 'సారీ అంకుల్‌ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు' అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది."

- బెనర్జీ, నటుడు

'మా' ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై హీరో తనీశ్​ స్పందించారు. "నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచీ నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. పోలింగ్ రోజు నన్ను మోహన్‌బాబు బూతులు తిట్టారు. నన్ను తిడుతుంటే ఆపిన బెనర్జీని కూడా మోహన్‌బాబు తిట్టిపోశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు" అని తనీశ్​ అన్నారు.

ఇదీ చూడండి.. 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ రాజీనామా

Last Updated : Oct 12, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.